ఇవిగో ఆధారాలు.. బేరసారాలు ఏ స్థాయిలో అంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొయినాబాద్ ఫాంహౌస్ లో ఉన్న వీడియోలను మీడియా సమావేశంలో బయటపెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొయినాబాద్ ఫాంహౌస్ లో ఉన్న వీడియోలను మీడియా సమావేశంలో బయటపెట్టారు. బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డాలు ఈ ఆపరేషన్ చేస్తున్నారని రామచంద్రభారతి అంటున్న మాటలు వీడియోలో కనిపించాయి.ఆర్ఎస్ఎస్ ప్రత్యేక వ్యవస్థ లని, బీజేపీ రాజకీయ పార్టీ అని కాని ఆర్ఎస్ఎస్ బీజేపీ వెనకే ఉంటుందని రామచంద్ర భారతి తెలిపారు. తుషార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ లో ఉన్నారని, ఆయన అమిత్ షా, జేపీ నడ్డాలతో మాట్లాడతారని ఆయన అన్నట్లు వినిపించింది. తాము రెడీగా ఉన్నామని బేరం కుదిరితే రెడీ అయిపోవాలని ఆయన అన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గాన్ని కూలిస్తే పార్టీలకతీతంగా పోరాడామని, ఇప్పుడు కూడా ఆ అవసరం ఉందన్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది తామేనని వారు చెప్పారన్నారు. ఈ వీడియోలో అమిత్ షా పేరు ఇరవై సార్లు, రెండు సార్లు మోడీ పేరు చెప్పారన్నారు. ఇంత డబ్బు వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ను ప్రధాన కార్యాలయంగా చేసుకుని ఈ బేరసారాలను జరుపుతున్నారన్నారు.