Wed Dec 25 2024 00:53:55 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి చంద్రబాబు స్కూల్ స్టూడెంట్ కానట్లుందే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చిన వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చిన వారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోనే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే ఛాన్స్ లభించింది. ఇప్పటికీ తన గురువు చంద్రబాబు అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలాగని రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టరనుకోండి. అది వేరే విషయం. అయితే చంద్రబాబు నుంచి రాజకీయాలను రేవంత్ రెడ్డి నేర్చుకోనట్లుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు వద్ద రాజకీయ శిష్యరికం చేసిన వారైతే ఇలా వ్యవహరించరన్న వ్యాఖ్యలు నెట్టింట కనిపిస్తున్నాయి.
ఏపీలో ఇలా...
ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిని అరెస్ట్ చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. అన్ని రకాలుగా రాజకీయంగా అంచనాలు వేసుకుంటారు. ఓటు బ్యాంకు ఉన్న వారు, సామాజికవర్గం కోణంలోనూ చూసి ఆయన ఆచి తూచి ప్రతి అడుగు వేస్తారు. ఏపీలో వైసీపీ నేతలపై కేసులు నమోదు కావడం లేదని, జగన్ ను ఇంకాఅరెస్ట్ చేయలేదెందుకని అక్కడ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో చంద్రబాబును ప్రశ్నిస్తుంది. అయినా చంద్రబాబు తొణకరు. బెణకరు. చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరికలు మాత్రం జారీ చేస్తుంటారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా అక్కడచిన్న స్థాయి నేతలు తప్పు పెద్దగా వైసీపీ నేతలు ఎవరూ అరెస్ట్ కాలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జగన్ వంటి వారి విషయాల్లో మెతక వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శలు సొంత పార్టీ నుంచి వినపడుతున్నా పెద్దగా పట్టించుకోరు చంద్రబాబు. కూల్ గా పనికానిచ్చేస్తారు.
తెలంగాణలో మాత్రం...
కానీ రేవంత్ రెడ్డి తెలంగాణాలో మాత్రం దూకుడుగా వెళుతున్నారన్న టాక్ వినపడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ హీరోలను అరెస్ట్ చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై కేసులను నమోదు చేయడంలో కూడా రేవంత్ రెడ్డి ముందుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ నడుస్తుంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఒక సామాజికవర్గంతో పాటు టాలీవుడ్ లో ప్రధానమైన వారంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకమయ్యే అవకాశముంది. ఇదే సమయంలో ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. దీంతో కేటీఆర్ పై సానుభూతి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఈ రెండు అంశాలు కీలకమైనవి.. సున్నితమైనవని.. జాగ్రత్తగా డీల్ చేసి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేయాల్సిన రేవంత్ రెడ్డి స్పీడ్ గా వెళ్లి ప్రత్యర్థులకు అవకాశాన్ని అప్పగిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి. మొత్తం మీద తన గురువు చంద్రబాబు పొలిటికల్ స్కూల్ నుంచి మాత్రం రేవంత్ రెడ్డి వచ్చినట్లు కనిపించడం లేదు. స్కూల్ ఒక్కటే అయినా సిలబస్ మాత్రం వేరుగానే ఉంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story