కరుణిస్తారా? కన్నెర్ర చేస్తారా?
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బేషరతుగా తమ డిమాండ్లను పక్కన పెట్టి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక యూనియన్లు [more]
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బేషరతుగా తమ డిమాండ్లను పక్కన పెట్టి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక యూనియన్లు [more]
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బేషరతుగా తమ డిమాండ్లను పక్కన పెట్టి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక యూనియన్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటే షరతులు విధించాలా? అవి ఎలా ఉండాలి? అనే దానిపై ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అధికారులతో చర్చిస్తున్నారు. షరతులు విధిస్తే తాము సమ్మె విరమణపై పునరాలోచించుకుంటామని ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ కార్మికులపై కరుణ చూపుతారా? కన్నెర్ర చేస్తారా? అన్నది నేడు తేలనుంది.