Thu Dec 26 2024 14:48:13 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ కోటాలో చారి సాబ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు చెందిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు చెందిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేశారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. గవర్నర్ కోటాలో ఆయనను ఎంపిక చేశారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి సిఫార్సు లేఖను పంపారు.
ఉద్యమ కాలం నుంచి....
మధుసూదనాచారి ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. మంత్రుల సంతకాలతో రాజ్ భవన్ కు సిఫార్సు లేఖను కేసీఆర్ పంపారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరును పెండింగ్ లో పెట్టడంతో ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు.
Next Story