సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. ఎందుకో తెలుసా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. పలు పార్టీలు ఇప్పటి..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. పలు పార్టీలు ఇప్పటి నుంచే పవులు కదుపుతున్నాయి. ఎవరికి టికెట్ ఇవ్వాలి..?అనే దానిపై చర్చలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక అధికార పార్టీ అయితే టీఆర్ఎస్ గత కొన్ని నెలల నుంచే ఎన్నికలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. గులాబీ బాస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపులపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. ఇప్పటి నుంచి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికలల్లో గెలుపొందడంతో పాటు ప్రతిపక్షాలకు చుక్కలు చూపించాల్సిన అవసరం ఉందని నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది.
వంద రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని, ప్రతిపక్షాల నేతలకంటే బీఆర్ఎస్ నాయకులకు ఇది క్లిష్టమైన సమయమని సీఎం కేసీఆర్ సొంత పార్టీ నేతలకు సూచిస్తునట్లు సమాచారం. ఎందుకంటే అధికార పార్టీ అనగానే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలో కొంత వ్యతిరేకత, సొంతపార్టీలోనే ప్రత్యర్థులు ఉండటం అనేది సహజమే. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి వారికి సూచనలు,సలహాలు అందిస్తున్నారు. ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కీలక సమయమని, జాగ్రత్తగా ఉండాలంటూ, ఏదైనా పొరపాటు ఉంటే సహించేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగ్గా లేదో వారిని ప్రగతి భవన్ కు పిలిచి తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా? లేదా అనేదానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నారట. ముందుగా సర్వేలతో ప్రజల నాడీ తెలుసుకునే కేసీఆర్ ఇప్పుడు కూడా గత ఆరు నెలలుగా పలు సర్వేలు చేయించారు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా..? లేదా అనేది తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉంటున్నారు…? నియోజకవర్గంలో అన్ని పనులు పూర్తి చేశారా? లేదా అనేది తెలుసుకుంటున్నారు. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో ఎక్కడైనా భూ వివాదాలు, కాంట్రాక్ట్ పనుల్లో జోక్యం చేసుకోవడం వంటి విషయాల్లో సీఎం కేసీఆర్ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలను సీఎం తన టేబుల్ పై పెట్టుకుని ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలని,లేకపోతే సహించేది లేదని పని తీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సుతిమెత్తని వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.