ఉత్తమ్, పొన్నాల, విజయశాంతి అరెస్ట్..!
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లా [more]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లా [more]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించేందుకు ప్రయత్నించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ కలెక్టరేట్ వద్ద విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. పలితాల్లో అవకతవకలపై న్యాయవిచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థులకు అండగా తాము పోరాడతామని స్పష్టం చేశారు.