Wed Jan 15 2025 13:37:06 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల ఘట్టంలో ముగిసిన కీలక పర్వం
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడం, ముహూర్తం బాగా ఉండటంతో పెద్దఎత్తున అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దఎత్తున ర్యాలీలతో బలప్రదర్శనగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు తదితరులు ఇవాళే నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ తదితరులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నటివరకు 1497 నామినేషన్లు దాఖలు కాగా ఇవాళ ఒక్కరోజు సుమారు వెయ్యి మంది నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. రేపు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. 22వవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
Next Story