Mon Jan 06 2025 09:29:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఫైనల్ రిజల్ట్ తేలింది
తెలంగాణ ఎన్నికల ఫైనల్ రిజల్ట్ తేలింది. టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. టీఆర్ఎస్ 87 స్థానాల్లో గెలవడంతో పాటు తుంగతుర్తి స్థానంలో ఆధిక్యతలో ఉంది. ఈ స్థానంలో కూడా టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలకే పరిమితమయ్యింది. తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లాలో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. ఎంఐఎం వారి 7 సీట్లను వారు తిరిగి గెలుచుకున్నారు. స్వతంత్రులు కోరుకంటి చందర్ రామంగుండం నుంచి రాములు నాయక్ వైరా నుంచి విజయం సాధించారు.
Next Story