హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ మొదలయిన కూల్చివేత పనులు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో ఊరట లభించింది. సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేత పనులను నిలిపేయాలని వేసిన పిటీషన్ ను [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో ఊరట లభించింది. సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేత పనులను నిలిపేయాలని వేసిన పిటీషన్ ను [more]
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు లో ఊరట లభించింది. సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేత పనులను నిలిపేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. సచివాలయ భవానల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదన్న అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కేవలం నూతన నిర్మాణానలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమని చెప్పారు. నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సచివాలయం కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కూడా చేశారు.