ఎన్నికల కమిషన్ పై హైకోర్టు అసహనం.. అసంతృప్తి
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు [more]
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు [more]
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా ముఖ్యమైనవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలసిందేనా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా అంటూ హైకోర్టు అడిగింది. ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం పరిచింది. కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా.. అప్పుడే ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు అని అడిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న ఎస్ ఈసీ తెలిపింది. ఫిబ్రవరిలోనే కరోనా రెండోదశ మొదలైనా.. ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారన్న హైకోర్టు అడిగింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ఎన్నికలను వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదా అంటూ ప్రశ్నించింది. కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించ లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదన్నని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని హైకోర్టు తెలిపింది.