స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు షరతులివే
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రేపటి నుంచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. తొలుత ఏడు రోజులు స్టే విధించిన హైకోర్టు పాఠశాలల [more]
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రేపటి నుంచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. తొలుత ఏడు రోజులు స్టే విధించిన హైకోర్టు పాఠశాలల [more]
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రేపటి నుంచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. తొలుత ఏడు రోజులు స్టే విధించిన హైకోర్టు పాఠశాలల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. ఎవరినీ పాఠశాలలకు రావాలని బలవంతం చేయొద్దని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రాతపూర్వకమైన హమీలు తీసుకోవద్దని కోరింది. పాఠశాలలను ప్రారంభించని ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవదని హైకోర్టు సూచించింది. అలాగే హాస్టల్స్ మాత్రం తెరవవద్దని ఆదేశించింది. దీనికి సంబంధించి వారం రోజుల్లోగా మార్గదర్శకాలను విడుదల చేయాలని హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది.