హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. సహనాన్ని పరీక్షించవద్దు
కరోనా వైరస్ వ్యాప్తి పైన తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు కాకపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. దీనికి సంబంధించి [more]
కరోనా వైరస్ వ్యాప్తి పైన తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు కాకపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. దీనికి సంబంధించి [more]
కరోనా వైరస్ వ్యాప్తి పైన తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు కాకపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది . తమ సహనాన్ని అధికారులు ఇంకా పరీక్షించవద్దని అలా చేసినప్పుడు తీవ్ర చర్యలు ఉంటాయని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. ఈ నెల 28న న సీఎస్, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాలని ఆదేశించింది. హెల్త్ బులెటిన్లలో సమగ్ర వివరాలు ఉండాలని మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్లు జిల్లాల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని పేర్కొంది. ఆస్పత్రుల వారీగా అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు వెల్లడింలని హైకోర్టు ఆదేశించింది.