Thu Dec 26 2024 00:42:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్ట్రేలియా బీచ్ లో గల్లంతైన తెలంగాణ వాసులు
ఆస్ట్రేలియాలోని మెనో బీచ్ లో తెలంగాణకు చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. ఆస్ట్రేలియాలో నివసించే నల్గొండకు చెందిన గౌసుద్దీన్(45), జునేద్(35), హైదరాబాద్ బీహెచ్ఈఎల్ రాహత్(35) బీచ్ కి వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు. వారు ప్రయాణిస్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. వీరిని కాపాడేందుకు వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగినా లంభం లేకుండా పోయింది. వీరి జాడ కోసం అక్కడి బృందాలు వెతకగా గౌసుద్దిన్, రాహత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. జునేద్ జాడ ఇంకా తెలియడం లేదు.
Next Story