Mon Dec 23 2024 23:43:42 GMT+0000 (Coordinated Universal Time)
పీవీపీ కోసం వెదుకులాట.. బెజవాడ చేరుకున్న పోలీసులు
వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కోసం తెలంగాణ పోలీసులు వెదుకుతున్నారు. పీవీపీపై రెండు కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. పీవీపీకి ఒక విల్లా విషయంలో దాడి చేశారని ఒక [more]
వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కోసం తెలంగాణ పోలీసులు వెదుకుతున్నారు. పీవీపీపై రెండు కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. పీవీపీకి ఒక విల్లా విషయంలో దాడి చేశారని ఒక [more]
వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ కోసం తెలంగాణ పోలీసులు వెదుకుతున్నారు. పీవీపీపై రెండు కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. పీవీపీకి ఒక విల్లా విషయంలో దాడి చేశారని ఒక కేసు నమోదు కాగా, నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులపై కుక్కలను ఉసిగొల్పారని మరో కేసు నమోదయింది. దీంతో తెలంగాణ పోలీసులు పీవీపీ కోసం బెజవాడ చేరుకున్నారు. పీవీపీ సన్నిహితులను విచారిస్తున్నారు. ఇటీవల 108 ప్రారంభోత్సవంలో పీవీపీ పాల్గొనడంతో ఆయన బెజవాడలోనే ఉన్నట్లుపోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story