ఆ రెండు పార్టీలకు బీజేపీ గాలం.. భారీ చేరికలు
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరింతగా ఊపందుకున్నాయి. పొలిటికల్..
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరింతగా ఊపందుకున్నాయి. పొలిటికల్ వార్ వేడెక్కిపోయింది. ఇక తెలంగాణలో కూడా ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగైన కారును ఢీకొట్టి అధికారంలోకి రావాలంటూ ఉవ్విళ్లూరుతున్నారు. అటు గులాబీ పార్టీ నేతలు, ఇటు హస్తం పార్టీ నేతలు తమదైన శైలిలో ముందుకు సాగుతుండగా, కమలం పార్టీ నేతలు మాత్రమే డిఫరెంట్ స్టైల్లో ముందుకెళ్తున్నారు. పార్టీలో కొత్త వారిని లాక్కునే పనిలో పడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలనను బీజేపీలోకి రప్పించుకునేందుకు గాలం వేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ఎవ్వరిని లాక్కోవాలనే ఆలోచనిలో పడిపోయింది. ఎలాగైన సరే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి ముఖ్య నేతలను చేర్చుకునేందుకు తవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో బీజేపీలో భారీగా చేరికలు:
త్వరలో బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు ఉంటాయని శనివారం ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావులు వెల్లడించారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరేందుకు దాదాపు 22 మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు. 22 మందిలో ఎవరెవరు ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నలకు వారు చెప్పేందుకు అంగీకరించలేదు. త్వరలో భారీ చేరికకలు ఉంటాయన్నది మీరే చూస్తారంటూ చెప్పుకొచ్చారు. ఎవరెవరు చేరుతారన్నది మరో వారం రోజులు ఆగాలని చెబుతున్నారు బీజేపీ నేతలు.
అమిత్ షా సమక్షంలో చేరికలు
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఢిల్లీ పెద్దలు సైతం తెలుగు రాష్ట్రాలపై కన్నేశారు. సభలు,సమావేశలు ఏర్పాటు చేసి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన అమిత్ షా ఖమ్మం జిల్లాకు రానున్నారు. అమిత్ షా సమక్షంలో ఈ చేరికలు ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు 22 మంది బీజేపీ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. మరి ఏ మేరకు చేరికలు ఉంటాయో చూడాలి.
విలేజ్ క్యాడర్‌పై ఫోకస్..
ఇక బీజేపీ విలేజ్‌లపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వివిధ పార్టీల్లో కీలక పాత్ర పోషించే నేతలను బీజేపీలోకి రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ముఖ్య పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తోంది.