Mon Dec 23 2024 13:17:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడే బీఆర్ఎస్ ఆవిర్భావం
తెలంగాణ రాష్ట్ర సమితి మరికాసేపట్లో జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతుంది
తెలంగాణ రాష్ట్ర సమితి మరికాసేపట్లో జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతుంది. ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంద.ి టీఆర్ఎస్ పార్టీ పేరు, పార్టీ రాజ్యాంగంలో మౌలిక ఉద్దేశ్యాలను మారుస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు హాజయ్యారు. భారత రాష్ట్ర సమితిగా ఈరోజు మారబోతుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.
1,19 గంటలకు ముహూర్తం....
1,19 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, 283 మంది జిల్లా నేతలతో కలసి ఆయన ఈ ఈ ప్రకటన చేయనున్నారు. సమావేశం అనంతరం వచ్చిన ప్రతినిధులందరికీ ప్రగతి భవన్ లో కేసీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం వారితో కలసి మీడియా సమవేశంలో మాట్లాడతారు. జేడీఎస్ తరుపున కుమారస్వామి హైదరాబాద్ చేరుకున్నారు. తమిళనాడులోని వీకేఎస్ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. ఈ నెల 9న ఢిల్లీలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Next Story