పాత సీసా…. కొత్త సారా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 31, 2021 వరకు కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. [more]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 31, 2021 వరకు కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. [more]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానం ప్రకటించింది. నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 31, 2021 వరకు కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 60 లక్షలు, లక్ష జనాభా నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ. 65 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించింది.
లాటరీ పద్దతిలో ఎంపిక….
మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షలు చేశారు. రాష్ట్రంలో 2216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాదారుల ఎంపిక జరగనుంది. మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.