జగన్ కు బాబు వార్నింగ్
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు దాఖలు చేయబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు దాఖలు చేయబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి [more]
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు దాఖలు చేయబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రద్దు చేసిన జీవోను జగన్ మళ్లీ వెనక్కు తెచ్చారన్నారు. వివేకా హత్యకేసుపై మాట్లాడితే వర్ల రామయ్యకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎందుకు ఇంత మంది ఎస్పీలను, సిట్ లను మార్చారన్నారు. పోలీసులు మీసాలు తిప్పి తొడగొడతారా? అని నిలదీశారు. జీవో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు జగన్ ను హెచ్చరించారు. అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను ఆర్థికంగా, మానసికంగాఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏమైనా మీ సామ్రాజ్యమా? రాక్షస రాజ్యమా? అని నిలదీశారు. అడిగితే సమాధానం చెప్పరని, తిడితే కేసులు పెడతారన్నారు.