Mon Dec 23 2024 07:45:46 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ సీజన్ 6 - 24 గంటలు లైవ్ ?
నాగ్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘బిగ్ బాస్’ చెయ్యబోతున్నట్లు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.
బిగ్ బాస్ సీజన్ -6. ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ కు దీనిపైనే ఆసక్తి ఎక్కువగా ఉంది. నెక్ట్స్ సీజన్ లో ఎవరెవరు కంటెస్టంట్లుగా వస్తున్నారు ? ఎలా ప్లాన్ చేస్తున్నారన్న విషయాలను తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున రెండు నెలల్లోనే సీజన్ 6 ను మొదలు పెట్టనున్నట్లు నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఎప్పుడు ఈ సీజన్ మొదలవుతుందా ? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 6 పై పలు కామెంట్స్ చేశారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..
ఆరుపదుల వయస్సులోనూ మన్మథుడిలా కనిపించే నాగార్జున.. ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే.. అంతబాగా పనిచేస్తానంటున్నారు. వరుస సినిమాలు, యాడ్స్, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటున్నారు బంగార్రాజు. బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్ ను నాని హెస్ట్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి వరుసగా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'బిగ్ బాస్' చెయ్యబోతున్నట్లు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.
24 గంటలు బిగ్ బాస్ లైవ్..
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. బిగ్ బాస్ ను ఇంతలా ఆదరించిన లవర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్నీ చూశాను. చేతిలో రాసుకొని కంటెస్టంట్స్తో మాట్లాడేవాడిని. బిగ్ బాస్ షో తర్వాత చాలా మంది మెసేజెస్ పెట్టారు. 'బిగ్ బాస్' ఓటీటీలో చేద్దాం అన్నారు. ఇది చాలా డిఫరెంట్ ఫార్మేట్. ఇది నంబర్ వన్ షో.. అలాగే ఓటీటీలో 24 గంటల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా లైవ్లో ఈ షో చెయ్యబోతున్నాం" అని తెలిపారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 ఓటీటీలో 24 గంటలు లైవ్ లో చేస్తున్నట్లు నాగార్జున చెప్పేశారు. ఇక బంగార్రాజు సినిమా గురించి మాట్లాడుతూ.. బంగార్రాజు పండుగ లాంటి సినిమా అంటూనే.. సంక్రాంతి బరిలోకి సినిమా రానున్నట్లు హింట్ ఇచ్చేశారు.
Next Story