Mon Dec 23 2024 12:29:16 GMT+0000 (Coordinated Universal Time)
వంగవీటి ఇంటికి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం వంగవీటి రాధాను కలిశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితం వంగవీటి రాధాను కలిశారు. తాడేపల్లిలోని వంగవీటి రాధా ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబును సాదరంగా రాధా ఆహ్వానించారు. ఇటీవల రాధా హత్యకు రెక్కీ జరిగిన విషయం పై ఆరా తీశారు. రాధాను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వంగవీటి రాధాతో పాటు ఆయన తల్లి చెన్నుపాటి రత్నకుమారిని కూడా చంద్రబాబు పలుకరించారు.
ప్రభుత్వం పక్కన పెట్టింది.....
చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి రాధా విషయంలో ప్రభుత్ం చూసీ చూడనట్లు వ్యవహరించిందని అన్నారు. సీసీ టీవీ పుటేజీ ద్వారా ఎవరు రెక్కీ నిర్వహించారో తెలుసుకోవచ్చన్నారు. దోషులను పట్టుకునే అవకాశముందని చంద్రబాబు అభిప్రుాయపడ్డారు. ఏడు రోజులయినా ఇప్పటి వరకూ దోషులను ఎందుకు పట్టించుకోలేదన్నారు. రెక్కీ చేసిందెవరు? ఎందుకోసం చేశారు? అన్నది ఇప్పటి వరకూ తేల్చలేకపోయిందన్నారు. ఆధారాలున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎవరు రెక్కీ చేశారన్న విషయంపై ప్రచారం జరిగిందని, దాని విషయంలో కూడా పోలీసులు తేల్చలేదన్నారు. వెంటనే దోషులను పట్టుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story