Thu Dec 26 2024 16:08:27 GMT+0000 (Coordinated Universal Time)
హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్న టీడీపీ బృందం
మడ అడవుల నరికివేత పై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటించనుంది. ఈ బృందంలో మాజీ మంత్రులు [more]
మడ అడవుల నరికివేత పై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటించనుంది. ఈ బృందంలో మాజీ మంత్రులు [more]
మడ అడవుల నరికివేత పై తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు కాకినాడలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటించనుంది. ఈ బృందంలో మాజీ మంత్రులు జవహర్, చినరాజప్ప, పితాని పత్యనారాయణ పర్యటించనున్నారు. మడ అడవులను నరికివేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంచడంపై తెలుగుదేశం అభ్యంతరం తెలుపుతోంది. దీనివల్ల పర్యావరణ ముప్పు ఏర్పడటమే కాకుండా, భవిష్యత్తులో తుఫాను వంటి ప్రమాదాలు ఉంటాయన్న ఆందోళన తెలుగుదేశం వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం బృందం ఈ ప్రాంతంలో పర్యటించి హైకమాండ్ కు నివేదిక ఇవ్వనుంది.
Next Story