Thu Dec 19 2024 06:02:55 GMT+0000 (Coordinated Universal Time)
బోండా కూడా జంపేనటగా
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం [more]
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం [more]
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బోండా ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి రాగానే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. మరి బోండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరితే ఏ పదవిని అప్పగిస్తారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. బోండా ఉమామహేశ్వరరావు పార్టీ మారడం దాదాపు ఖాయమైపోయిందని ఆయన సన్నిహితులు సయితం చెబుతున్నారు.
Next Story