Sat Dec 21 2024 14:43:58 GMT+0000 (Coordinated Universal Time)
పాటను ఏకాకిని చేశావు కదా సామీ
తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి
తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిలింఛాంబర్ నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో సిరివెన్నెల పార్థీవదేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ క్రతువును నిర్వహించారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, సాహితీ ప్రియులు వేలాది మంది మహాప్రస్థానానికి చేరుకున్నారు. సిరివెన్నెల కుమారులు అంతిమ సంస్కారాలు చేశారు.
టాలీవుడ్ ను...
టాలీవుడ్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం కలచి వేసింది. టాలీవుడ్ మొత్తం సిరివెన్నెల కు నివాళులర్పించింది. తమతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెలను ప్రతి ఇంట్లో తమ వాడిగా చూసుకున్నామని విలపించారు. తమ సినిమాలకు ఆయన రాసిన పాటలను మననం చేసుకుంటూ బోరుమన్నారు. మొత్తం మీద టాలీవుడ్ లో సిరివెన్నెల ప్రస్థానం ముగిసింది.
Next Story