నాకేమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరు
తన ప్రాణానికి ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తనకు భద్రత కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ఆయన ఈరోజు [more]
తన ప్రాణానికి ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తనకు భద్రత కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ఆయన ఈరోజు [more]
తన ప్రాణానికి ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తనకు భద్రత కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ఆయన ఈరోజు ప్రకాశం జిల్లాలో మరణించిన టీడీపీ కార్యకర్త పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. పద్మ మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహిళను రోడ్డుపైనే వివస్త్రను చేసి అవమానించడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ఇప్పటికే తెలుగుదేశ పార్టీ కార్యకర్తలను ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటామని, కార్యకర్తలకు అండగా నిలుస్తామని చెప్పారు. మృతి చెందిన పద్మకుటుంబానికి చంద్రబాబునాయుడు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.