Mon Dec 23 2024 08:30:53 GMT+0000 (Coordinated Universal Time)
వారిని వదిలేసి వీరిపై చర్యలా? ఇదేంటి బాబూ?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఓటమికి వారిని బాధ్యులను చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఓటమికి వారిని బాధ్యులను చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాగానే ఉంది. చంద్రబాబు నిర్ణయం కరెక్టే. కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమికి ఈ చిన్న స్థాయి నేతలే కారణమా? అన్న చర్చ జరుగుతుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినైనా సస్పెండ్ చేయాల్సిందే.కానీ చంద్రబాబు చేసిందేమిటి? అసలు కారకులను వదిలేసి చిన్న నేతలను బలిచేస్తే ప్రయోజనం ఉంటుందా?
ఘోర ఓటమికి...
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 54 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. జీరో రిజల్ట్ వచ్చింది. ఇది దిగ్భ్రాంతి కరమైన విషయం. టీడీపీ జిల్లాలో బలంగా లేదా? అంటే ఎవరూ దానిని అంగీకరించరు. నెల్లూరు జిల్లాలో తొలి నుంచి టీడీపీ సత్తా చాటుతూనే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలను గెలవలేకపోయినా, ఒక్క డివిజన్ ను దక్కించుకోలేని హీనస్థితిలో ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సీనియర్ నేతలు....
నెల్లూరు జిల్లాలో టీడీపీకి హేమాహేమీలు ఉన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ వంటి నేతలున్నారు. ఎన్నికలకు ముందు బాధ్యతలను వీరికే చంద్రబాబు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక కూడా వీరి కనుసన్నల్లోనే జరిగింది. చివరి నిమిషం వరకూ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు.
ఎవరు కారణం?
వీరితో పాటు సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాలయ చినరాజప్ప, అచ్చెన్నాయుడు వంటి వారు కూడా నెల్లూరు కార్పొరేషన్ పై దృష్టి పెట్టారు. కానీ సీనియర్ నేతలు ఈ ఓటమికి కారణం కాదని చంద్రబాబు తేల్చేసినట్లయింది. గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరి రంగారావులను సస్పెండ్ చేశారు. ద్వితీయ శ్రేణి నేతలను బాధ్యులను చేసి అసలు కారకులను వదిలేయడం చర్చనీయాంశమైంది.
- Tags
- chandra babu
- tdp
Next Story