పవన్ .. ఏందిది సామీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు దాటుతుంది. కానీ ఆయన చేసే వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు దాటుతుంది. రాజకీయంగా ఆయన అడుగులు ఇంకా ఎక్కువే. కానీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. ఎన్నికల్లో గెలవాలన్న కనీస ధ్యాస లేని నేతగానే పవన్ను చూడాల్సి ఉంటుంది. జనసేనాని తెలంగాణ నేతలను వెనకేసుకు రావడానికి చేసిన ప్రయత్నం రాజకీయంగా వికటించే అవకాశముంది. పవన్ రాజకీయమంతా ఆంధ్రప్రదేశ్ లోనే. తెలంగాణలో ఆయన దృష్టి పెట్టడం కూడా తక్కువే. అలాంటిది పవన్ తెలంగాణ మంత్రులను వెనకేసుకు రావడం చర్చనీయాంశమైంది. ఒకరు చెబితే వినిరేకం వ్యక్తి కాదు. అలా అని సోదరుడు చిరంజీవిలాగా సున్నిత మనస్కుడూ కాదు. ఏది పడితే అది.. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుంటే ఇక రాజకీయాలు ఎలా చేస్తారని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే అయినట్లే అని వారిలో వారు మౌనంగా రోదిస్తూ ఉండి పోవాల్సి వస్తుంది.