బ్రేకింగ్ : శాసనసభలో గందరగోళం
శాసనసభ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడంది. టీడీపీ సభ్యులు జై అమరావతి, సేవ్ అమరావతి [more]
శాసనసభ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడంది. టీడీపీ సభ్యులు జై అమరావతి, సేవ్ అమరావతి [more]
శాసనసభ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడంది. టీడీపీ సభ్యులు జై అమరావతి, సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేయడంతో సభలో ఎవరు ఏం మాట్లాడు తున్నారో అర్థం కావడం లేదు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు వినలేదు. కొడాలి నాని టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. స్పీకర్ పోడింయ చుట్టూ గుమికూడటంతో అక్కడి నుంచి పంపించివేయాలని మార్షల్స్ ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు. దీంతో వైసీపీ సభ్యులు కూడా టీడీపీ ఎమ్మెల్యేలపై దూసుకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పరిస్థితిపై స్పందించారు. ఇంత దిక్కుమాలిన ఎమ్మెల్యేలను చూడలేదన్నారు. టీడీపీ సభ్యులు తమ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతు్నారన్నారు. రెచ్చగొడితే మా ఎమ్మెల్యేలు దాడి చేస్తే ఎవరు బాధ్యులని జగన్ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్పీకర్ మార్షల్స్ ను పిలిపించారు. టీడీపీ సభ్యుల తీరుపై సపీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.