Mon Nov 18 2024 08:50:39 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్‌లో "కనిపిస్తే కాల్చివేత"
మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీచేసింది. ఇరు వర్గాలు ఒకరి ఇళ్లపై ఒకరు దాడులకు దిగడంతో ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య జరుగుతున్న ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం కేంద్ర సాయాన్ని కోరింది. అనేక చోట్ల ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను దుండగులు తగులపెట్టారు.
రిజర్వేషన్ల గొడవ...
అసోం రైఫిల్స్‌తో పాటు ఆర్మీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి పరిస్థిితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. గిరిజనులు, మేతేయీల మధ్య ఘర్షణలు జరుగుతుండమే ఇందుకు కారణం. మైతేయీలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రదర్శనలు నిర్వహించింది. తమ రిజర్వేషన్లకు గండికొట్టే ప్రయత్నం చేయవద్దంటూ ప్రదర్శనలు చేపట్టింది.
పది జిల్లాల్లో...
అయితే ఇది నచ్చని మరో వర్గం దాడులకు దిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో హింసాత్మకంగా మారింది. మెజారిటీ వర్గమైన మేతేయీలను రిజర్వేషన్లో చేర్చడానికి వీలులేదని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కనిపిస్తే కాల్చి వేత ఉత్వర్వులు జారీ చేసింది. అనేక చోట్ల కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. మణిపూర్‌లోని పది జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. బాధితులను ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
Next Story