Mon Dec 23 2024 07:55:17 GMT+0000 (Coordinated Universal Time)
అబుదాబి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉగ్రదాడి
అబుదాబిలో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్లతో యెమెన్ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈసారి ప్రత్యక్షంగా కాకుండా.. డ్రోన్లతో పరోక్షంగా దాడులు జరిపారు. అబుదాబిలో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్లతో యెమెన్ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అబుదాబిలో రెండు అగ్నిప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
అబుదాబి ఎయిర్ పోర్టు కు సమీపంలో ఉన్న మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు సమాచారం. రెండు ఆయిల్ ట్యాంకర్లలో మంటలు సంభవించాయని, కొత్త విమనాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని అబుదాబి పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ.. Yemen's Iran-aligned Houthi movement ప్రకటించినట్లు సమాచారం.
Next Story