Mon Dec 23 2024 04:46:18 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్ధవ్ కు కొత్త సమస్య.. క్యాంప్ నుంచే ఫైళ్ల క్లియరెన్స్
మహారాష్ట్ర సంక్షోభంలో థాక్రే కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. షిండే వెంట ఉన్న మంత్రులు ఫైళ్ల ను క్లియర్ చేస్తున్నారు.
మహారాష్ట్ర సంక్షోభంలో థాక్రే సర్కార్ కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఏక్నాథ్ షిండే వెంట ఉన్న మంత్రులు ఫైళ్ల ను క్లియర్ చేస్తున్నారు. ఇది ఉద్ధవ్ థాక్రేకు ఇబ్బందికరంగా మారింది. సంక్షోభం ప్రారంభమయిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు 12 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1600 కోట్ల విలువైన పనులకు సంబంధించి సంబంధిత మంత్రులు ఫైళ్లపై సంతకాలు చేసి క్లియర్ చేసినట్లు థాక్రే సర్కార్ కనుగొనింది.
రూ.1200 కోట్ల విలువైన....
అందులో ఒక్క విద్యుత్తు శాఖకు చెందిన ఫైలు విలువ 1200 కోట్ల రూపాయలుగా గుర్తించారు. విద్యుత్ శాఖ మంత్రి గులాబీరావు పాటిల్ పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన ఫైలును క్లియర్ చేశారని సమాచారం. అసమ్మతి గ్రూపుల క్యాంప్ నిర్వహణలో పలు పరిశ్రమల యాజమాన్యం కూడా ఉన్నట్లు ఉద్ధవ్ థాక్రే అనుమానిస్తున్నారు. క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలకు ఆర్థిక సహకరం కూడా అందిస్తున్నారు.
అధికారులతో సమీక్ష.....
అయితే దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈరోజు నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అసమ్మతి క్యాంప్ లో ఉండి ఫైళ్లపై సంతకాలు చేస్తున్న మంత్రులను ఆ శాఖల నుంచి తప్పించాలని చూస్తున్నారు. ముఖ్యమైన శాఖలకు సంబంధించిన అధికారులకు కూడా ఎలాంటి ఫైళ్లు క్లియర్ చేయవద్దని ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రధానంగా పరిశ్రమలకు ఇచ్చిన 1200 కోట్ల రాయితీ ని వెనక్కు తీసుకునే యోచనలో కూడా ఉద్ధవ్ ప్రభుత్వం ఉంది. మొత్తం మీద క్యాంప్ లో ఉండి మంత్రులు తమ శాఖలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తూ క్లియర్ చేస్తుండటం ఉద్ధవ్ సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తుంది.
Next Story