హైదరాబాద్ కు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈకేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ వ్యాపార వివాదాలు పరిష్కారమవుతాయని ఎన్వీ రమణ [more]
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈకేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ వ్యాపార వివాదాలు పరిష్కారమవుతాయని ఎన్వీ రమణ [more]
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈకేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ వ్యాపార వివాదాలు పరిష్కారమవుతాయని ఎన్వీ రమణ చెప్పారు. ఇప్పటి వరకూ ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి సింగపూర్, దుబాయ్ దేశాలకు వెళ్లాల్సి ఉందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ఇతర దేశాల వాళ్లు కూడా హైదరాబాద్ కు వస్తారని ఎన్వీ రమణ అన్నారు. ఈ ఆర్బిట్రేషన్ కేంద్రంపై పరిశ్రమల యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. ఈరోజు చరిత్రలో మరిచిపోలేని రోజని ఎన్వీ రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులతో పాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఇంద్రకిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.