విద్యార్థులకు సెలవుల పండగ
తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను మరో వారం పాటు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం [more]
తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను మరో వారం పాటు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం [more]
తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులను మరో వారం పాటు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తుంటారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో మళ్లీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందిపడకూడదని ప్రభుత్వం సెలవులు పొడగించింది.
19న తెలంగాణ బంద్ …
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈ నెల 19న తెలంగాణ బంద్ పాటించాలని పిలుపునిచ్చింి. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు, 14న అన్ని డిపోల ఎదుట బైఠాయింపు, 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న జేఏసీకి మద్దతుగా ర్యాలీలు, 17న ధూంధాంలు, 18న బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ షెడ్యూల్ ప్రకటించింది. 19న తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని కోరింది.