కేసీఆర్ చెప్పిందే ….వీళ్లు చేస్తున్నారు?
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సైతం పాల్గొన్నారు. నాడు తెలంగాణ కోసం [more]
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సైతం పాల్గొన్నారు. నాడు తెలంగాణ కోసం [more]
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సైతం పాల్గొన్నారు. నాడు తెలంగాణ కోసం కేసీఆర్ సమ్మెలో ఏం చేయాలో సూచించారు. రోజుకో విధంగా సమ్మె చేపట్టాలని కేసీఆర్ మార్గనిర్ధేశం చేసేవారు. డిపోల ముందు నిరసనలు, వంటావార్పు, రోడ్లపై బైఠాయింపులు, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేయడం, విద్యార్థులను ఏకం చేయడం, ఉద్యగసంఘాలను కలుపుకోవడం వంటివన్నీ కేసీఆరే సూచించారు. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ సైతం కేసీఆర్ పంథాలోనే పోతున్నారు. కేసీఆర్ నాడు చెప్పిన సూత్రాలనే ఇప్పుడు ఆయన మీదే అమలు చేస్తున్నారు.