Fri Nov 22 2024 11:47:41 GMT+0000 (Coordinated Universal Time)
240 మంది విద్యార్థులతో భారత్ కు చేరుకున్న మూడో విమానం
తాజాగా 240 మంది విద్యార్థులతో మూడో విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరిలో 11 మంది తెలుగు విద్యార్థులుండగా.. మొత్తం మూడు
న్యూ ఢిల్లీ : ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను తిరిగి స్వదేశానికి క్షేమంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం, భారత్ ఎంబసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆపరేషన్ గంగ పేరుతో.. భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు విమానాలు ఇండియాకు రాగా.. తాజాగా 240 మంది విద్యార్థులతో మూడో విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరిలో 11 మంది తెలుగు విద్యార్థులుండగా.. మొత్తం మూడు విమానాల్లో 59 మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న మరికొందరు విద్యార్థులను తరలించేందుకు మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచింది భారత్. అక్కడ చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు. నిన్న రాత్రి 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబై చేరుకోగా..తెల్లవారు జామున 250 మందితో మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టులకు చేరుకున్న తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నరాత్రి ఉక్రెయిన్ నుంచి ముంబైకి వచ్చిన తొలి విమానంలో ఉన్న 20మంది తెలుగు విద్యార్థులు.. కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ెయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డితో పాటు డీసీపీ స్వాగతం పలికారు.
Next Story