Fri Nov 22 2024 23:18:02 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ ను ఊడ్చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
పంజాబ్ లో అనూహ్య ఫలితాలు కనపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.
పంజాబ్ లో అనూహ్య ఫలితాలు కనపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 74 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 35 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలు ఉండగా, 59 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ వంద స్థానాలను దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ముఖ్యులంతా వెనుకంజ....
పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. అలాగే పీసీసీ చీఫ్ సిద్ధూ సయితం వెనుకబడి ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అంచనాల ప్రకారం అధికారం వైపునకు దూసుకుపోతుంది.
Next Story