వినుడు వినుడు రామాయణ గాథ
రామ మందిరం ప్రారంభోత్సవ వేళ తులసి దాస్ విరచిత రామ్ చరిత మానస్ పుస్తకాకానికి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ లో ఉన్న ఈ పుస్తకాన్ని తక్కువ ధరకు అందిస్తోంది. గత ఏడాది వరకు సంవత్సరానికి 75 వేల కాపీల వరకు ఈ రచనను ముద్రించి విక్రయించేవారు. అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణ నేపథ్యంలో.. ఏడాది కాలంగా 11 లక్షల కాపీలు అమ్ముడైనట్లు గీత ప్రెస్ మేనేజర్ లాల్ మని త్రిపాఠి చెప్పారు.
రామ మందిరం ప్రారంభోత్సవ వేళ తులసి దాస్ విరచిత రామ్ చరిత మానస్ పుస్తకాకానికి భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ లో ఉన్న గీతా ప్రెస్ ఈ పుస్తకాన్ని తక్కువ ధరకు అందిస్తోంది. గత ఏడాది వరకు సంవత్సరానికి 75 వేల కాపీల వరకు ఈ రచనను ముద్రించి విక్రయించేవారు. అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణ నేపథ్యంలో.. ఏడాది కాలంగా 11 లక్షల కాపీలు అమ్ముడైనట్లు ప్రెస్ మేనేజర్ లాల్ మని త్రిపాఠి చెప్పారు.
ఆధ్యాత్మిక సేవలో భాగంగా గీతా ప్రెస్ తక్కువ ధరలకే హిందూ పురానేతిహాసాలను జనాలకి అందిస్తోంది. 1923లో జయదయాల్ ఈ ప్రెస్ ను ప్రారంభించారు ఇప్పటివరకు eదాదాపు 42 కోట్ల పుస్తకాలను అచ్చు వేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఊపందుకున్న తర్వాత ప్రెస్ ఆధ్వర్యంలో ప్రచురించే రామ్ చరిత్ మానస్ కు డిమాండ్ బాగా పెరిగింది ఇప్పటికీ ఈ పుస్తకానికి ఆర్డర్లు వస్తున్నాయని ప్రెస్ మేనేజర్ త్రిపాఠి చెప్పారు. గీతా ప్రెస్ ప్రచురించిన పుస్తకాల్లో అత్యధికంగా 16 కోట్ల భగవద్గీత కాపీలు అమ్ముడుపోవడం విశేషం. ఆ తర్వాత రామ్ చరిత్ ను 11 కోట్ల 73 లక్షల మంది కొనుగోలు చేసారు. అయోధ్య లో రామాలయం ప్రారంభం తర్వాత ఈ పుస్తకానికి డిమాండ్ ఇంకా పెరగొచ్చని భావిస్తున్నట్లు మేనేజర్ వెల్లడించారు.