Mon Dec 23 2024 20:05:53 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. 12 కోట్లకు డీల్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. సుపారీ హత్య కుట్రను చేధించినట్లు తెలిసింది. శ్రీనివాస్ గౌడ్ హత్యకు 12 కోట్ల రూపాయల సుపారీ డీల్ కుదిరినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడయింది. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సుపారీ డీల్...
శ్రీనివాస్ గౌడ్ తో పాటు అతడి సోదరుడు హత్యకు ప్లాన్ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల విచారణలో బట్టబయలయింది. శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఎందుకు ప్లాన్ చేశారు? అందుకు రాజకీయ కారణాలేవైనా ఉన్నాయా? వ్యక్తిగత విభేదాలా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. కాసేపట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించనున్నారు. నిందితులను ఢిల్లీ, హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story