Mon Dec 23 2024 20:24:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోల మృతి
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ ఘడ్ జిల్లాలోని బీజాపూర్ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా చిన్న చందా అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి.
తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు...
మావోయిస్టులకు, తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం గాలింపు చేపడుతున్న గ్రేహౌండ్స్ దళాలకు ఎదురుపడటంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొంనసాగుతున్నాయి.
Next Story