Mon Dec 23 2024 10:36:34 GMT+0000 (Coordinated Universal Time)
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు బోల్తాపడిన ఘటనలో పది మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు బోల్తాపడిన ఘటనలో పది మంది మృతి చెందారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని మలుపు వద్ద ప్రయివేటు బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వేణుకు, చిత్తూరు జల్లా నారాయణవనం యువతితో వివాహం జరగాల్సి ఉంది. నిశ్చితార్థం వేడుకల కోసం పెళ్లికుమారుడి కుటుంబం బస్సులో ధర్మవరం నుంచి 63 మందితో కలసి బయలుదేరింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నిశ్చితార్థ వేడుకలకు....
ఈ ప్రమాదంలో మలిశెట్టి వెంగప్ప, మలిశెట్టి మురళి, కాంతమ్మ, గణేష్, యశస్విని, డ్రైవర్ నబీ రసూల్, క్లీనర్ లతో పాటు ఒక చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యాభై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story