Fri Jan 03 2025 02:12:56 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ లో ఘోరం... ఏడుగురు మృతి
సికింద్రాబద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు
సికింద్రాబద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పాస్పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లార్ లో ఎలక్ట్రికల్ స్కూటర్ల బ్యాటరీలు పేలి లాడ్జిలోకి మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో ఉన్న ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. గాయపడిన కొందరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఎలక్ట్రిక్ బ్యాటరలు...
రూబీ హోటల్ మొత్తం 25 గదులున్నాయి. అందులో ఇరవైై మూడు మంది ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో విజయవాడకు చెందిన హరీశ్, చెన్నైకు చెందని సీతారామన్, ఢిల్లీకి చెందిన వీరేంద్ర ఉన్నట్లు పోలీసులు గుర్తంచారు. మిగిలిన వారు స్పృహకోల్పోయి లాడ్జిలో పడి ఉన్నారు. ఈ ఘటనలో పది మందికి పైగా తీవ్ర గాయాలపాలవ్వడంతో వారందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు లాడ్జిపై నుంచి కిందకు దూకారు. హోటల్ కు ఇన్, ఎగ్జిట్ ఒకే దారి ఉండటంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story