Mon Dec 23 2024 08:18:35 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రైలు ప్రమాదం.. 60 మంది మృతి
కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అరవై మంది మృతి చెందినట్లు తెలిసింది
కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అరవై మంది మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇంతపెద్ద సంఖ్యలో మృతిచెందడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. లుయెన్ పట్టణం నుంచి టెంకే పట్టణం వైపు వెళుతున్న రైలు ప్రమాదానికి గురైంది.
లోయలో పడి....
ఈ రైలు బయోఫ్వే గ్రామం సమీపంలోకి రాగానే పట్టాలు తప్పింది. వేగంగా వస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ఏడు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడ్డాయి. ఈ కారణంగానే 60 మంది మరణించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులకు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
Next Story