Reavanth : పార్టీలో వారికి రేవంత్ డెడ్ లైన్ ఇదే
తెలంగాణ కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. జనగామకు [more]
తెలంగాణ కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. జనగామకు [more]
తెలంగాణ కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. జనగామకు చెందిన తమకు పాస్ లు ఇవ్వలేదని కోమటిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. కేవలం పొన్నాల లక్ష్మయ్య వర్గం వారికే పాస్ లు ఇచ్చారని వారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారు. కావాలని కోమటిరెడ్డి వర్గాన్ని దూరం పెట్టారని పీసీసీ నేతలపై వారు మండి పడ్డారు. రేవంత్ వర్గం కూడా సీరియస్ అయింది. రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.
జనవరి 26 తర్వాత…?
సమస్యలపై పోరాటం చేయని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వారికి రేవంత్ రెడ్డి జనవరి 26 వరకూ డెడ్ లైన్ పెట్టారు. ఈ లోగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన కపోతే వారికి ఇక పార్టీ నుంచి పని చెప్పబోమని కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కోసం ఐక్యంగా పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, పనిచేయని నేతలు పార్టీకి అవసరం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు చచ్చిన వాళ్లతో సమానమన్నారు.