Mon Dec 23 2024 19:40:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చివరి టీ 20.. భారత్ జట్టులో
భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగే మూడో టీ 20 నేడు జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది.
భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగే మూడో టీ 20 నేడు జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుంది. కానీ ఒక్క మ్యాచ్ అయినా గెలిచి తమ సత్తా తగ్గిపోలేదని నిరూపించుకోవాలని వెస్టిండీస్ తలపోస్తుంది. ఈ నేపథ్యంలో జరగనున్న మూడో మ్యాచ్ ఉత్కంఠ భరితంగానే సాగనుంది. ఇప్పటికే టీ 20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. రెండు మ్యాచ్ లలో వరసగా గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది.
మార్పులతో...
భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లోనూ విజయం సాధించి జోరుమీద ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరస విజయాలు భారత్ కు దక్కుతున్నాయి. అయితే ఈ చివరి టీ 20 లో కొహ్లి స్థానంలో శ్రేయస్ అయ్యర్, పంత్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ లను భారత్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. సిరీస్ ఇప్పటికే భారత్ సొంతం కావడంతో జట్టులో మార్పులు భారీగానే ఉంటాయి.
పటిష్టంగానే...
ఇక వెస్టిండీస్ జట్లు ప్రపంచంలోనే టీ 20లలో అత్యుత్తమ జట్టు. వెస్టిండీస్ ను ఎప్పటీకి టీ 20లో కొట్టి పారేయలేం. ఓపెనర్ నుంచి మిడిలార్డర్ చివరి వరకూ బ్యాట్స్ మెన్ లు వీర బాదుడు బాదేవారే. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన జట్టుగా వెస్టిండీస్ ను పేర్కొంటారు. చివరి వన్డేలో గెలవాలన్న లక్ష్యంతో ఆ జట్టు బరిలోకి దిగుతుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Tags
- india
- west indies
Next Story