Sat Nov 23 2024 11:55:17 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ మామూలుది కాదు
iaf mi 17v5 అత్యంత శక్తిమంతమైన చాపర్ ఇది. మిలటరీ ట్రాన్స్ పోర్టు హెలికాప్టర్ గా దీనిని వినియోగిస్తారు.
iaf mi 17v5 హెలికాప్టర్. అత్యంత శక్తిమంతమైన చాపర్ ఇది. మిలటరీ ట్రాన్స్ పోర్టు హెలికాప్టర్ గా దీనిని వినియోగిస్తారు. ఒకే సారి 20 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా ఇదే. ఇందులో 14 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 11 మంది చనిపోయినట్లు ప్రకటించారు. అయితే ఈ హెలికాప్టర్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
అత్యంత శక్తిమంతమైనది...
ఈ హెలికాప్టర్ అత్యంత శక్తిమంతమైనది. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇలాంటి భారత్ లో 36 ఉన్నాయి. ఇది ఏ వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. క్లిష్ట సమయంలోనూ టేకాఫ్ తీసుకోగలదు. ల్యాండ్ అవ్వగలదు. 2013 లో ఈ హెలికాప్టర్ లు భారత్ కు దిగుమతి అయ్యాయి. 13000 కిలోల బరువున్న ఈ హెలికాప్టర్ లో 36 మంది ప్రయాణించే వీలుంది. 4,500 కిలోల బరువును ఈ హెలికాప్టర్ మోయగలదు. ఎత్తైన పర్వతాల్లోనూ వీటిని వినియోగిస్తారు.
ఇప్పటికి ఐదుసార్లు....
గతంలోనూ ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురయి కొందరు ప్రాణాలు కోల్పోయారు. 2013లో రెండు సార్లు, 2016, 2018, 2019 లో ఈ హెలికాప్టర్ లు ప్రమాదానికి గురయ్యాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో జరిగిన దుర్ఘటన అత్యంత పెద్దదిగా చెప్పాలి. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో మరణించడం కూడా ఇదే తొలిసారి. మరి తమిళనాడులో జరిగిన ప్రమాదానికి గల కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ నుంచి తెలుసుకోవాల్సిందే.
Next Story