అఖిలపక్షం తర్వాతనేనా?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగనుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక కేబెనెట్ ముందుకు టేబుల్ ఐటెంగా వచ్చింది. [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగనుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక కేబెనెట్ ముందుకు టేబుల్ ఐటెంగా వచ్చింది. [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగనుంది. జీఎన్ రావు కమిటీ నివేదిక కేబెనెట్ ముందుకు టేబుల్ ఐటెంగా వచ్చింది. అయితే ఈరోజు జీఎన్ రావు కమిటీపైన చర్చించి, అఖిలపక్ష సమావేశం తర్వాతనే రాజధానిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదికపైన కూడా కేబెనెట్ చర్చించనుంది. సున్నితమైన అంశం కావడంతో అఖిలపక్ష భేటీ తర్వాతే మూడు రాజధానుల ప్రకటన చేసే అవకాశముందంటున్నారు. అయితే అఖిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అన్నదానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే విపక్షాలైన టీడీపీ, బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీలు మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకి స్తున్నందున అఖిపక్ష సమావేశం ఉంటుందా? లేదా? అన్నది కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.