Fri Nov 22 2024 19:04:02 GMT+0000 (Coordinated Universal Time)
క్రాస్ చెక్ చేసుకోకుండానే ఫలితాల విడుదల
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫలితాల్లో తప్పులు జరగడానికి కారణాలను పరిశీలించిన కమిటీ 15 అంశాలతో కూడిన [more]
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫలితాల్లో తప్పులు జరగడానికి కారణాలను పరిశీలించిన కమిటీ 15 అంశాలతో కూడిన [more]
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫలితాల్లో తప్పులు జరగడానికి కారణాలను పరిశీలించిన కమిటీ 15 అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఫలితాల విషయంలో గ్లోబెరినా సంస్థతో పాటు ఇంటర్ బోర్డు కూడా పలు తప్పులు చేసినట్లు కమిటీ గుర్తించింది. ఫలితాలను క్రాస్ చెక్ చేసుకోకుండానే ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనుంది.
Next Story