తమ్ముళ్లు తన్నుకు ఛస్తున్నారే....!!
మహాకూటమి అయితే ఏర్పడింది. ఎవరికి ఎన్ని స్థానాల్లో తేలే లేదు. ఎక్కడ ఇస్తారో అసలే ఏమి లేదు. కానీ తెలుగుదేశం ఆశావహులు రోడ్డెక్కి టికెట్ కోసం తన్నులాట మొదలు పెట్టేశారు. చెప్పులు సైతం విసురుకుని తమ ప్రతాపం చూపించేశారు. వీరి ఆందోళనకు ట్రాఫిక్ సైతం నిలిచిపోయి జనం చీదరించుకునే పరిస్థితి వచ్చేసింది. పోలీసులు వచ్చి బతిమాలి రెండు గ్రూప్ లకు సర్దిచెప్పి పంపడంతో ప్రస్తుతం శాంతించినా పరిస్థితి మాత్రం నివురు గప్పిన నిప్పులానే వుంది. ఇది భాగ్యనగర్ శేరిలింగంపల్లి సీటు కోసం పసుపు తమ్ముళ్ళ కుస్తీ.
రచ్చ రంబోలా ...
శేరి లింగంపల్లి స్థానం తమకే కేటాయిస్తారని టిడిపి తమ్ముళ్ళు గంపెడాశతో వున్నారు. ఈ స్థానం లో టికెట్ నాకంటే నాకని మొవ్వా సత్యనారాయణ, ఆనంద్ ప్రసాద్ వర్గాలు ప్రచారం సైతం మొదలు పెట్టేశాయి. ర్యాలీలుగా బయల్దేరి జనంలో తిరగడం మొదలు పెట్టేశాయి. రెండు గ్రూప్ లు ఉండటంతో ఇరువురు ఒకేచోట ఎదురు కావడంతో ఇద్దరి నడుమ యుద్ధం మొదలైంది. వీరి వివాదం ఇప్పడు టి టిడిపికి తలపోటుగా మారింది.
సీటు తేల్చాలంటూ....
దాంతో దీనిపై పంచాయితీ పెట్టి సీటు తేల్చాలని లేనిపక్షంలో రెండు వర్గాల తలపోట్లు కూటమికి నష్టం తెస్తాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు ఇప్పుడే వీరు రోడ్డెక్కడంతో కాంగ్రెస్ లో గుబులు బయల్దేరి ఆ స్థానాలు ఆశిస్తున్న వారు పోరాటం మొదలు పెట్టేశారు. ఇప్పుడు రెండు పార్టీలకు ఈ స్థానం ప్రతిష్ట్మాకం అన్న రీతిన మారడంతో ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి సర్వత్రా బయల్దేరింది.
- Tags
- ananda prasad
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- left parties
- movva satyanarayana
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- ఆనంద్ ప్రసాద్
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- మొవ్వా సత్యనారాయణ
- వామపక్ష పార్టీలు