Sun Dec 22 2024 01:54:39 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ సంచలన నిర్ణయం.. మే 31వ తేదీ వరకూ?
మే 31వ తేదీ వరకూ తిరుమలలో శ్రీవారి దర్శనాలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. మే 31వరకూ స్వామి వారి దర్శనం ఉండదని తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ [more]
మే 31వ తేదీ వరకూ తిరుమలలో శ్రీవారి దర్శనాలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. మే 31వరకూ స్వామి వారి దర్శనం ఉండదని తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ [more]
మే 31వ తేదీ వరకూ తిరుమలలో శ్రీవారి దర్శనాలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. మే 31వరకూ స్వామి వారి దర్శనం ఉండదని తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం, సేవల కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని తెలిపింది. మే 31వ వరకూ దర్శనం టిక్కెట్లతో పాటు, సేవా టిక్కెట్లను కూడా టీటీడీ నిలిపివేసింది. మే 3వ తేదీ వరకూ దేశమంతా లాక్ డౌన్ ఉన్నప్పటికీ దర్శనాలకు అనుమతిస్తే సోషల్ డిస్టెన్స్ ఆలయంలో సాధ్యం కాదని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకూ శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతించకూడదని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Next Story