Sat Nov 23 2024 03:31:27 GMT+0000 (Coordinated Universal Time)
హవ్వ... ఇంత సాదాసీదాగానా... రైల్వేశాఖ మారదా?
తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త డిజైన్ అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. కేంద్రం విడుదల చేసిన డిజైన్ ను అంగీకరించడం లేదు.
తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త డిజైన్ ను స్థానికులు అంగీకరించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన డిజైన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తిరుపతి నూతన రైల్వే స్టేషన్ డిజైన్ మార్పు చేయాలని కోరుతూ నేడు తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలవనున్నారు. ఆయనను కలసి డిజైన్ ను మార్చాలని ఆయన వినతి పత్రాన్ని అందజేయనున్నారు. ఆధ్మాత్మిక క్షేత్రానికి అనువైన డిజైన్ ను రూపొందించాలని కోరనున్నారు.
ఆధునికీకరించాలని....
తిరుమల రైల్వే స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఆధునికీకరించాలని నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. నిత్యం వేల సంఖ్యలో దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం రైల్వే స్టేషన్ కు వస్తుంటారు. దీనిని అభివృద్ధి చేయడం రైల్వే శాఖ కర్తవ్యం. అందులో భాగంగా ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త డిజైన్లను....
త్వరలోనే పనులను కూడా ప్రారంభించనుంది. కాంట్రాక్టు కూడా ఇచ్చేశారు. పనులు ప్రారంభం కాబోతున్న తరుణంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేసిన రైల్వే స్టేషన్ డిజైన్ సాదా సీదాగా ఉంది. మిగిలిన స్టేషన్ల మాదిరి పోలి ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆధ్యాత్మికత డిజైన్ల ఏదని ప్రశ్నలు వినపడుతున్నాయి. పలువురు ప్రముఖులు కూడా తిరుపతి డిజైన్ ను తప్పుపడుతున్నారు.
అభ్యంతరాలు....
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ డిజైన్ పై అభ్యంతరం తెలిపారు. మంత్రిని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. రైల్వే స్టేషన్ డిజైన్ ను వెస్టర్న్ డిజైన్ ను కాపీ చేసినట్లుగా ఉందని, దీనిని ప్రజలు ఎవరూ అంగీకరించడం లేదని, ఈ విషయం తమ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. భారతీయ ఆద్మాత్మికతపై పట్టున్న వారి చేత డిజైన్ లు చేయించాలని, గ్లాస్, స్టీల్ తో కూడిన భవనాల కాపీ కొట్టద్దని నాగ్ అశ్విన్ సూచించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రిని కలసి స్థానికుల అభ్యంతరాలను కూడా తెలియచేయనున్నారు. మరి కొత్త రైల్వే స్టేషన్ డిజైన్ మారుస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story