మగ పిల్లవాడు పుట్టలేదంటూ
ముస్లిం మహిళల కోసం కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చిన కూడా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. హైదరబాద్ లో మరొకరు తలాక్ చెప్పాడు. ఆడపిల్ల పుట్టిందని తలాక్ [more]
ముస్లిం మహిళల కోసం కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చిన కూడా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. హైదరబాద్ లో మరొకరు తలాక్ చెప్పాడు. ఆడపిల్ల పుట్టిందని తలాక్ [more]
ముస్లిం మహిళల కోసం కేంద్రం ఎన్ని చట్టాలు తెచ్చిన కూడా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. హైదరబాద్ లో మరొకరు తలాక్ చెప్పాడు. ఆడపిల్ల పుట్టిందని తలాక్ చెప్పి భార్యను వదిలి పెట్టిపోయిన సంఘటన పాతబస్తీలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 2011లో మిరాజ్ బేగం ,దస్తగిరి లకు వివాహం జరిగింది. దస్తగిరి ఒక ప్రైవేటు ఉద్యోగి . వివాహ సమయంలో పెద్ద మొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్ల తర్వాత మిరాజ్ గర్భవతి అయింది. పురిటి నొప్పులతో ఇంట్లో బాధపడుతున్నప్పటికి భర్త ఆసుపత్రికి తీసుకుని వెళ్లలేదు. కొన్ని మూలికలు తీసుకుని వచ్చి తాగించారు. దీంతో సాధారణ డెలివరీ కావడంతో పాప కడుపులోనే చనిపోయింది.
మగపిల్లాడు పుట్టలేదని…..
మొదటి కాన్పులో మిరాజ్ బేగం కు ఆడపిల్ల పుట్టింది. ఇటివల కాలంలో రెండో సారి మిరాజ్ గర్భవతి అయింది. అయితే ఈసారి తనకు మగపిల్లాడిని ఇవ్వక పొతే నిన్ను వదిలించుకుంటానని పదేపదే దస్తగిరి భార్యకు చెప్పాడు . కొన్నాళ్ల క్రితం మిరాజ్ డెలివరీ అయింది. ఆడపిల్ల పుట్టింది .దీంతో దస్తగిరి కుటుంబ సభ్యులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా మిరాజ్ పైన దాడి చేశారు . భర్త ఎదుటనే అత్తమామలతో కలిసి ఆడపడుచు దాడి చేస్తున్నప్పటికి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. భర్త ప్రవర్తన పైన కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చారు . దస్తగిరి లో మార్పు రాలేదు. చివరకు పోలీసుల భరోసా కౌన్సెలింగ్ సెంటర్ ని ఆశ్రయించింది. మిరాజ్ బేగం ఫిర్యాదు చేయడంతో దస్తగిరికి మూడుసార్టు కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎప్పడైనా సరే తన భర్తలో మార్పు వస్తుందని మిరాజ్ బేగం బావించింది. కాని అనుకొని విధంగా దస్తగిరి మిరాజ్ బేగం ను పుట్టింటికి తీసి కెళ్లి అక్కడ అందరూ ముందే తలాక్ చెప్పి దస్తగిరి వెళ్లిపోయాడు . మగ పిల్లాడిని కని ఇవ్వకపోవడంతో పోవడంతో తలాక్ ఇస్తున్నానని చెప్పి దస్తగిరి వెళ్లిపోయాడు. దీంతో మిరాజ్ బేగం వెంటనే పాతబస్తీలోని ఉమెన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.